![]() |
![]() |

కాస్టింగ్ కౌచ్.. ఈ పదం వింటే చాలు సినిమా రంగంలో తమ సత్తా చాటి నటిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలనుకునే ఎంతో మంది నటీమణులు ఉలికిపాటుకి గురవుతారు. అయినా సరే కాస్టింగ్ కౌచ్ తన ప్రభావాన్ని చాటుతూనే ఉంటుంది.
ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ జాబితాలోకి ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా క్వాత్రా చేరారు. 'కహానీ ఘర్ ఘర్ కీ', 'కుంకుమ్' వంటి సూపర్ హిట్ హిందీ సీరియళ్లతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్న శ్వేతా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదురైన భయానక కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశారు. ఆమె మాట్లాడుతు 'ఒకసారి ఒక ఆఫీసు గదిలోకి వెళ్లినప్పుడు, అక్కడ కొందరు కాస్టింగ్ ఏజెంట్లు మాత్రమే ఉన్నారు. గదిలో మరెవరూ లేని సమయంలో ఒక ఏజెంట్ నేరుగా వచ్చి, "నువ్వు అవకాశాల కోసం కాంప్రమైజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నావా?" అని అడిగాడు. ఆ సమయంలో కాంప్రమైజ్ అనే పదానికి అసలు అర్థం ఏమిటో కూడా నాకు తెలియదు. దాంతో అయోమయంగా చూస్తుండటంతో, ఆ ఏజెంట్లు ముఖ కవళికలు మారుస్తూ అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆ గదిలో కేవలం వారు మాత్రమే ఉండటంతో చాలా భయం వేసింది.
Also read: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై ఫత్వా జారీ.. అసలు ఏం జరిగిందంటే?
ఆ క్లిష్ట పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ఒక అమాయకురాలిలా నటించాల్సి వచ్చింది. ఇంకోసారి చాలా మంది అమ్మాయిలు ఆడిషన్ కి వస్తున్నారని తెలిసి ఒక హోటల్ కి ఆడిషన్ కి వెళ్ళాను. లోపల ఉన్న రచయిత, దర్శకుడు, నిర్మాత మాట్లాడుతు స్విమ్ సూట్ టెస్ట్ కోసం నువ్వు బట్టలు విప్పాలి, ఆ దుస్తుల్లో నువ్వు ఎలా ఉంటావో మేము చూడాలి" అని అనగానే ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి క్షణాల్లో పారిపోయాను. దీంతో ఎక్కడికి వెళ్లినా ప్రమాదం వస్తే ఎలా పారిపోవాలి అనే మార్గాన్ని ముందుగానే చూసుకోవడం అలవాటు చేసుకున్నానని శ్వేతా క్వాత్రా కన్నీటి పర్యంతమయ్యారు. ఇండస్ట్రీలో ఉండే కొందరు మధ్యవర్తులు, ఏజెంట్లు అవకాశాల కోసం వచ్చే అమాయకపు అమ్మాయిల బలహీనతలని క్యాష్ చేసుకుంటున్నారు. అసలు ఒక ఆఫీస్ గదిలో బెడ్ ఎందుకు ఉంటుంది? అక్కడ బెడ్ ఉండాల్సిన అవసరం ఏముంది?" అని ఆమె ప్రశ్నించారు. గత 20 ఏళ్లకు పైగా టెలివిజన్ రంగంలో ఎన్నో విలక్షణమైన రోల్స్ తో అలరించిన శ్వేతా, ప్రస్తుతం దుబాయ్‌లో తన భర్త మానవ్ గోహిల్ తో నివాసం ఉంటుంది. మానవ్ గోహిల్ కూడా నటుడే.
shweta kwatra, Casting Couch
![]() |
![]() |